కుక్క పిల్ల( బాల గేయం ) ---మమత ఐల-హైదరాబాద్-9247593432


 అమ్మో! నాన్న వచ్చాడు

కుక్క పిల్లను తెచ్చాడు

ఎంత చక్కగా చూస్తుంది

బహు ముచ్చటగా వున్నదది


ప్రేమతో దగ్గరికొస్తుంది

తోకాడిస్తూ వుంటుంది

విశ్వాసంతో వుంటుంది

నాకొరకెదిరి చూస్తుంది


సైయాట కోసము వస్తుంది

చెప్పినట్టుగా వింటుంది

సైగలతోనే చెప్తుంది

మాట్లాడుమని చూస్తుంది


స్కులుకు వెల్లిన నాకోసం

ఎదురొచ్చి స్వాగతం చెబుతుంది

మంచి దోస్తు నాకైయ్యింది

ముద్దిచ్చినట్టు నాకేస్తుంది