ప్రశ్న(బాలగేయం): -మమత ఐల-హైదరాబాద్-9247593432

 కైలాసం అను ఆటొకటుంది
అందులో పాములు వుంటాయి
పాములనోటికి చిక్కక మనము
కైలాసము వరకు వెల్లాలి
నిచ్చన లెక్కుతు వెళ్ళచ్చు
నిచ్చన దొరకని పక్షమున
అడుగులు వేస్తు వెళ్ళచ్చు
పాము నోటిలో పడ్డామా
రయ్యన క్రిందకు దిగుతాము
పాము మింగిన గడినుండి
తోక గడి వరకు దిగుతాము
కైలాసము వరకు చేరే ముందు
అక్కడ వుండును వొకపాము
అతి పొడవైనది ఆపాము
పెద్దగ వుండును ఆపాము
ఆపాము నోటిన పడినామా
ఆట మొదటికి చేరుదుము
తప్పించుకొని వెళ్ళాలి
సరాదా గుండును ఈఆట

ఈపఠము పేరు చెప్పండి పిల్లలు?
జవాబు
(పరమ పదసోపాన పఠం)
కామెంట్‌లు