ఆవుదూడ కథనమ్మ
చెబుతాను నువ్వినవమ్మ
దూడంటే ఓ కవితమ్మ
ఆవుకు ఎంత ప్రేమమ్మ
దూడను విడిచి బ్రతికేన
హాయిగ అదిజీవించేనా
తల్లి పేగు గద ఓయమ్మ
తల్లడిల్లును గదనమ్మ
తల్లి బిడ్డల ప్రేమను బాపి
దూడ నెత్తుకొని పోయాడు
దొంగ బుద్దితో పగవాడు
ఎత్తుక పోయిన లేగదూడను
ప్రేమగ పెంచక కసిరేవాడు
తల్లి ప్రేమకు దూరమాయెను
మోసగాడికి చిక్కి పోయెను
బెంగతొ క్రుంగి పోతుంది
మేతమేయడం ఆపింది
జాలి లేని ఆకర్కషుడు
దొంగతనం బైటికి వస్తుందని
దూడను విడువక పోయాడు
ఆవుదూడ కథ(బాల గేయం )-మమత ఐల-హైదరాబాద్-9247593432
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి