అలనాటి నటి నిర్మల.వేదికనుండి-వెండితెరకు. : - డా.బెల్లంకొండనాగేశ్వరరావు చెన్నై .9884429899.


 తెలుగు చలనచిత్ర సీమలో బామ్మ పాత్రలలో తనకంటూ ఓగుర్తింపు పొందిన నటీమణి నిర్మల.కృష్ణాజిల్లా లొని మచిలీపట్నంలో సెప్టెంబర్ మాసంలో 1927  జన్మించిన ఈమె అసలుపేరు 'రాజామణి' చిన్ననాటినుండి నాటకాలపట్ల ఆసక్తి కలిగి ఉండటంవలన నృత్యం అభ్యసించారు.నటి ఛాయదేవి మంచినర్తకి,ఆమెతో కలసి నిర్మల చాలా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. మహానటి సావిత్రితో ఆరోజుల్లో 'ఉదయిని' అనే నాటక సంస్ధ స్ధాపించి పలునాటకాలు ప్రదర్శించారు.ఒక నాటక ప్రదర్శనకు హిందీనటుడు ఫృద్వీరాజ్ కపూర్ వచ్చి నిర్మలను ఆశీర్వదించారు.

అనంతరం నిర్మలాదేవిగా పేరుమార్చుకుని ఆంద్రనాటక కళాపరిషత్తులో 'సారంగధర' 'కరువురోజులు' 'నాయకురాలు' వేయిపడగలు' వంటి నాటకాలు ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.చల్లపల్లి జమిందార్ రాజా గారి సిఫారస్ తొ ఘంటసాల బలరామయ్యగారు నిర్మించిన 'పార్వతి కల్యాణం'(1941)లో మునికన్యగా నటించారు.అనంతరం 'గరుడగర్వభంగం' (943)లొ భానుమతి గారి చెలికత్తెగా నటించారు. 'మాయాలోకం'(1945)రంగసానిగా,పల్నాటియుధ్ధంలో బృందనర్తకిగా నటించారు.

ప్రజానాట్యమండలి బృందంలోని జి.వి.కృష్టారావుగారిని 1946 వివాహం చేసుకున్నారు.ఆయన తరువాత సినిమా ప్రొడక్షన్ మేనేజర్ గా స్ధిరపడ్డారు.'అంతామనవాళ్ళే'(1954) చిత్రంలో వల్లంనరసింహారావు సరసన కథానాయకిగా నటించే అవకాశం వచ్చింది.ఆచిత్రదర్శకుడు తాపిచాణిక్య ఈమెపేరు నిర్మలగా మార్చాడు.ఆచిత్రంలో నిర్మల స్ధానంలో కృష్ణకుమారి ని తీసుకున్నారు.

కె.ఎస్.ప్రకాశరావు సిఫారస్ తొ వి.మధుసూధనరావు గారి చిత్రం 'మనుషులుమారాలి'(1969) బామ్మవేషం ఈమె సినీ జీవితానికి మంచి పునాది వేసింది.'కృష్ణప్రేమ'(1961) 'పేదరాసిపెద్దమ్మ'(1968) 'దేవత' (1965)'కులగోత్రాలు'(1962) 'జీవనతరంగాలు'(1973) 'భార్యాభర్తలు' (1961)'బలిపీఠం'(1975)వంటి దాదాపు 900 చిత్రాలకు పైగా అరవై ఏళ్ళ సినీ జీవితంలో నటించారు.వీరి చివరిచిత్రం' ప్రేమకు స్వాగతం'(2002)అలా చిన్నవయసులోనే బామ్మపాత్రలలో ఒదిగి పోయింది.'మయూరి' (1985) చిత్రం ద్వారా నంది అవార్డు స్వీకరించారు.సంతానం లేకపోవడంవలన 'కవిత'అనే అమ్మాయిని పెంచుకున్నారు.ఆమె భర్త ప్రసాద్ సినీ నిర్మాత. ఈమె పలుచిత్రాలకు పెట్టుబడులు సమకూర్చేవారు. పరిశ్రమలో అందరూ ఈమెను ఇష్టపడేవారు.కళా రంగానికి అసమాన సేవలుఅందించి వేదికనుండి వెండి తెరకు వెళ్ళిన నిర్మల 2009 లో కళామతల్లి పాదసేవకై బ్రహ్మలోకం తరలి వెళ్ళారు.