అహంకారపు కోడె త్రాచులనణగ ద్రొక్కిన కీర్తి సౌరభ
రమ్య వాటిక పరిమళించును
బ్రతుకు తోటను భరతపుత్రుడ! 81
మధురమగు మన తెలుగు భాషను
మరచి పోవుట తగదు నీకుర
తల్లి పాలను త్రాగి రొమ్మును
తన్న బోకుర భరతపుత్రుడ! 82
భరత పుత్రుడా! (గేయ సూక్తులు):-డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల 9948089819