భరత పుత్రుడా! (గేయ సూక్తులు):-డాక్టర్. కొండబత్తిని రవీందర్-కోరుట్ల. జిల్లా. జగిత్యాల- 9948089819


 దుష్ట వర్తన మందు సాగిన

దోషిగా నువు నిలిచి పోదువు

దుర్మధాందుల నణచి వేసిన

తుష్టి కలుగుర భరతపుత్రుడ! 91


తోటి వారల కించ పరచుట

దోష మని నీ వెరుగ వలెరా

తోడ బుట్టిన వోలె వారిని

చూడ వలెరా భరత పుత్రుడ! 92