భరత పుత్రుడా! (గేయ సూక్తులు):---డాక్టర్. కొండబత్తిని రవీందర్-- కోరుట్ల. జిల్లా. జగిత్యాల 9948089819

 శాంతి ధనమును కొల్ల గొట్టకు
సమత భావము చేరుప బోకుము
జాతి గీతిక పాడుకొమ్ముర
జయము నీదే భరతపుత్రుడ! 99

ఆడి తప్పిన వాని బ్రతుకొక
వాడి పోయిన పూల తోటర
సత్యమే తన దివ్యపథమని
చాటి చెప్పరు భరతపుత్రుడ! 100

కామెంట్‌లు