భరత పుత్రుడా! (గేయ సూక్తులు):-డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల- 9948089819

 గుండె లోపల గుడిని నిలుపుచు
గురువు యే నా దైవమనుచు
భక్తి భావము దెలియ జేసిన
ముక్తి కలుగుర భరతపుత్రుడ!105

ధ్యాన మందున గురువు రూపము
తలచు కొమ్ముర తనివి తీరగ
గురువు చూపే దివ్య మార్గము
స్వర్ణమయమే భరతపుత్రుడ!106