సంస్కృతీ చిహ్నం...!!: -___కె.ఎల్వీ


 స్త్రీ  శరీరం 

అందమైన 

కళా ఖండం ,

ఒక శిల్పి చేతితో ,

చెక్కబడ్డ ..

అపురూప శిల్పం 

సౌందర్య రూపం ,

క్లిష్టమయిన 

శరీర నిర్మాణం ,

వస్త్ర ధారణకొక 

సవాలు ...!


మన ..

సంస్కృతీ __

సంప్రదాయాల పేరుతో ,

స్త్రీమూర్తి కి ,

కట్టూ _ బొట్టూ ...

నిర్ణయించేశారు ,

అందులో ..

అగ్రస్థానం 

చీర కట్టుబడిదే కదా !


చీరకట్టుబడితోనే ,

స్త్రీత్వపు ఉనికి 

బయట పడుతుంది ,

అమ్మలు _ బామ్మలూ 

నేర్పిస్తారుకనుక ,

కళ్లుమూసుకుని కూడా 

చీర కట్టుకోగలరు _

మన ఆడపిల్లలు !


చీర కట్టుకోవడం అంటే ,

అదో గొప్పకళ ..

స్త్రీ అందాన్ని ..

పదిరెట్లు పెంచే 

మన సంప్రదాయం ,

పూర్వీకులు _

మిగిల్చిపోయిన ,

గొప్ప అలంకారం ..!


మన మహిళ ల 

చీరకట్టుబడి ..,

విశ్వవ్యాప్తంగా 

భారతీయతను చాటే ,

మేటి సంస్కృతీ చిహ్నం !!