దొండకాయ మంచి రుచిని బలాన్నిచ్చే కూరగాయ. దీనితో పాటుగా దొండ ఆకులు దొండ పూలు కూడా ఔషధంగా పనికి వస్తాయి. దొండ ఆకులు చక్కెర వ్యాధికి మంచి మందు. దీని ఆకుల్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా కత్తిరించి నీళ్లలో వేసి మరిగించి చల్లార్చి త్రాగితే చక్కెర వ్యాధి తగ్గుముఖం పడుతుంది.దొండ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దొండ పండు ను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ వ్యాధిని తగ్గిస్తుంది. అలర్జీలు దద్దుర్లు లాంటివి రావు.
కొన్ని బాగా పండిన దొండ పళ్ళను తీసుకొని మెత్తగా చిదిమి జిలకర్ర పొడి ఉప్పు వేసి నీరు పోసి మరిగించి చల్లార్చి త్రాగితే, నోటిలోని పుండ్లు తగ్గిపోతాయి. కాలేయ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. చర్మ వ్యాధులను రానివ్వదు.
కొన్ని దొండ పూలను సేకరించి కొబ్బరి నూనెలో వేసి తైలంగా కాచి కుష్టు వ్యాధి లో వచ్చే పుళ్లపై రాస్తే పుళ్ళు తగ్గిపోతాయి.
దొండకాయ కూర ను మితంగా తినాలి. దీన్ని ఎక్కువగా తింటే మబ్బుతనం, అతి నిద్ర కు కారణం అవుతుంది.
దొండకాయలు, దొండ ఆకులు - ఔషధంగా... : - పి . కమలాకర్ రావు