జోకరు వచ్చేశాడండి పిల్లలూజోకులు తెచ్చేశాడండి పిల్లలూ
బడిలో పడే బాధలన్నీ వదిలి
హాయిగా నవ్వుకోండి పిల్లలూ!
బాధరబంధీలు లేని బాల్యాన్ని
హాయిగా అనుభవించండి పిల్లలూ!
పక్కవాడు గోలచేస్తే నిన్ను
కొట్టినా మాస్టారిని మరిచి
నవ్వండి పిల్లలూ నవ్వండి!
ప్రతిసారి క్లాసిఫాస్ట్ రాలేదని
కోప్పడే నాన్నను మరిచి
నవ్వండి పిల్లలూ నవ్వండి!
ఎంత చదివినా కొద్దిసేపైనా
అడుకొనివ్వని అమ్మని మరచి
నవ్వండి పిల్లలూ నవ్వండి!
ర్యాంకుల్ని తెచ్చే పిల్లల్ని తప్ప
పలకరించని చైర్మన్లను మరచి
నవ్వండి పిల్లలూ నవ్వండి!
వత్తిళ్ళు పెట్టని స్కూళ్ల కోసం
వెతుకుదాం పదండి పిల్లలూ
మానసిక జబ్బుల్నిచ్చే స్కూళ్లను
మట్టిలో పాతేద్దాం రండి పిల్లలూ!
జోకరు:-డా.కందేపి రాణి ప్రసాద్