కొబ్బరి చెట్ల గుబురులోంచి

లేలేత కిరణాలు జాలువారుతున్న వేళ

పులకించకుండా ఎవరుండగలరు?


నీరెండ పడగానే నల్లటి రోడ్లన్ని

వెలుగుల చొక్కా తొడిగేసుకుంటాయి!

రోడ్డుకు ఇరువైపులా ఉన్న వీధి లైట్లు

ముఖాలు చిన్నబుచ్చుకుంటాయి!

చిన్నమొక్కలు తలలు పైకెత్తి చూస్తాయి!

బోదెల్లో ప్రవహించే నీళ్ళు

తళుకులు అద్దుకుంటాయి!

యువకులు సూర్యుడితౌ పోటి పడుతుంటారు!


ఉదయకాలంలో

భానుడి రాక ఒక చైతన్యం!

భానుడి తేజస్సు ఒక ఉత్సాహం!