పాండవులు ప్రశ్నింప పదమంటూ పిలిచెనుకురుక్షేత్రము నందు కురు పితామహ భీష్మమూడు పక్షములుగా పూర్తి అంపశయ్యనునిలిచియుండె నకటా నిల్పి కృష్ణ స్మరణధర్మ సూక్ష్మములడుగ ధర్మరాజాదులునుతాతగారి చెంతకు తాపమనమున వెడలెగాయముల బాధకును గట్టి యుపశమనమిడకురువృద్ధుడిటు పలికె కూర్మి మనుమల జూచి"హే !ద్రౌపదీ వినుము,హెచ్చు కృష్ణభక్తినికలిగియున్న గానీ కలుషితమాయె తనువుకురువంశ రక్షణకు కుటిలమై యోచించిఅంపశయ్యను నేడు నల్లాడు చుంటిని!హే,,కృష్ణ !నాతోడ నౌరసపు ధర్మములుజెప్పించు చుంటివే జాతిరక్షణ కొరకునీవేల దెలుపవూ నీరజాక్ష !"ని పలికె!---------------------------------------------------భీష్మ ఏకాదశి-ఇష్టపదులు -2అనుభవముతో జెప్పు నట్టితత్వము మేలుతనకితానుగ నెపుడు తత్వమే పలుకదుగనేలతన తత్వమును నిరూపించు మొలకగనీవిక యుపదేశము నీమనుమల కివ్వుము!"అని హరియు పలుకగా నతిభక్తితో భీష్మజలధినుండి గ్రహించు జలజము తీరుగానుధర్మ సూత్రములనూ ధరవిష్ణు సహస్రముపాండవులకు దెల్పియు పరమాత్మను జేరెను!
భీష్మ ఏకాదశి -ఇష్టపదులు : -- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు