ప్రజాపతులు:-డా.రామక‌ కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.


 అక్షరాలతో చైతన్యం సృష్టించి

ప్రయోగాలతో ఆలోచింపజేసి

తమ రచనలతో ఆకట్టుకొని

సమస్యలను లేవనెత్తుతూ

అవగాహన కల్పస్తూ

పరిష్కారాలను‌ సూచించే కర్తలై

రవిగాంచని చోటును కూడా అన్వేషించి

వర్ణనల,శిల్పాల విన్యాసాలను ఆవిష్కరిస్తూ

సమాజ ఉపయోగ సృజనలు సృష్టించి

తమ బాధ్యతను నెరవేరుస్తారు.

ప్రజలకు,ప్రభుత్వానికి మధ్య వారధై

సమాజానికి,ప్రజలకు మధ్య స్నేహితులై

అక్షరయజ్ఞం చేసే యాజ్ఞికులు వారు.

నిరంతరం ఆధునికులై

సర్వ వేళలా దార్శనికులై

ఉత్సాహం,ఉత్తేజం రగిలించే

అక్షరదివిటీలై

సాహిత్య సరస్వతికి నిత్య అక్షరాభిషేకాలు చేసే 

అభినవ వ్యాసులు కవులే.

హితోపదేశకులై,మార్గదర్శకులై 

నడిపిస్తారు.

స్రష్టలై,విధాతలై చరిత్ర సృష్టిస్తారు.