వినమ్ర సలహా:-కవిత వేంకటేశ్వర్లు

 పాప పుడితే పండుగ చేసుకోవాలి

అమ్మాయి జన్మిస్తే ఆనందించాలి

కూతురైతే మోమున కాంతులు

విరజిమ్మాలి

తనయ అయితే తన్మయత్వం

చెందాలి

అప్పుడే స్త్రీని గౌరవించినట్టు

అప్పుడే మహిళకు మకుటం

పెట్టినట్టు

ఆపెను అందలం ఎక్కించినట్టు

ఆమెకు ప్రముఖ స్థానం కల్పించినట్టు

ఉరకే సభలు సమావేశాల్లో

పొగిడినట్టు కాదు

తల్లి అని మహాతల్లి అని

దేవతని మహాలక్షి అని

అనడం కాదు

మాటల్లో కొనియాడి

వెన్నుపోటు పొడవడం కాదు

కవితల్లో పొగిడి

ఇంట్లో కాంతను కాల్చుక తినడం కాదు

మహిళ దినోత్సవమని

మభ్యపెట్టకు

సభ్య సమాజంలో తలవ0చనీకు

ఇది నా వినమ్ర సలహా

కానీయకు అపోహ!!