జగద్విదితమైన పల్నాటి పౌరుషం, శౌర్య ప్రతాపాలకు సముద్రమంత లోతైన, హిమాలయమంత ఎత్తైన చరిత్ర ఉంది.*పల్నాటి సీమ ఇప్పటి గుంటూరు జిల్లాలో ఒక తాలూకా. దీని ముఖ్య గ్రామం గురజాల. ఈ సీమ కృష్ణా నదికి దక్షిణ తీరాన సముద్రానికి సుమారు 120 మైళ్ళ దూరంలో ఉంది. ఉత్తర పడమర దిక్కులలో 75 మైళ్ళ పొడవునా కృష్ణానది ప్రవహిస్తుంది. దక్షిణ ప్రాంతమంతా కొండల చేత, దట్టమైన అడవుల చేత ఆవరింపబడి ఉంది. దీని వైశాల్యం దాదాపు 1050 చదరపు మైళ్ళు. నాగులేరు, చంద్రవంక ఈ ప్రాంతంలోని ముఖ్య నదులు.పల్నాటి రాజ్యం పొందిన అనుగురాజు..పల్నాటి రాజులకు మూల పురుషుడైన అనుగురాజు హైహయ రాజవంశానికి చెందిన వాడు. మధ్యప్రదేశ్ లోని జబల్ పుర్ ప్రాంతంనుంచి సైన్యంతో తెలుగునాడుకు వలస వచ్చిన ఈయన కార్త వీర్యార్జునుడి సంతతికి చెందిన వాడుగా చరిత్రకారుల భాష్యం. ఈయన ఆంధ్రా, కోస్తా తీరంలోని చందవోలును పాలిస్తున్న వేలంటి చోళునితో తలపడతాడు. ఈ కయ్యం వియ్యంగా మారుతుంది. అనుగురాజు చందవోలు రాకుమారి మైలమ దేవిని వివాహమాడిన కారణంగా పల్నాటి రాజ్యం పొందుతాడు.మంత్రిగా బ్రహ్మనాయుడు...అనుగురాజు తెలుగు భాషకు, సంస్కృతి వ్యవహారాలకు కొత్త కావడంతో విజ్ఞుడయిన, అపార అనుభవం ఉన్న దొడ్డనాయుడిని మంత్రిగా నియమిస్తారు. ఈ దొడ్డనాయుడి పెద్ద కుమారుడే బ్రహ్మనాయుడు. అనుగురాజుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య సంతానం నలగామ రాజు, నరసింహ రాజు. రెండవ భార్య సంతానం మలిదేవుడు, ఆయన సోదరులు. అనుగు రాజు మరణించే నాటికి మలిదేవులు చాలా చిన్న వయస్కులు. అనుగురాజు తర్వాత నలగామ రాజు పల్నాడు సీమకు ప్రభువయ్యాడు. ఆయనకు తోడుగా నరసింహరాజు ఉన్నాడు. వీరి పాలనలో కూడా మహామంత్రిగా బ్రహ్మనాయుడే కొనసాగాడు.విడిపోయిన రాజ్యాలు..కురువృద్ధుడు భీష్మాచార్యుడి వంటి బ్రహ్మనాయుడు మాచర్ల ప్రభువైన మలిదేవులకు మంత్రిగా, రక్షకుడిగా వెళ్ళాడు. తరతరాలుగా కలసి ఉంటున్న ప్రజల మధ్య రాజ్య విభజన తీరని క్షోభను మిగిలిస్తుందని, రాజ్యాన్ని చెక్కముక్కలు చేయవద్దని విజ్ఞుడైన బ్రహ్మనాయుడు భావించాడు. విభజనను ఆపేందుకు శతవిధాలా యత్నించాడు. విడిపోయిన తరువాత గురజాలరాజు నలగాముడు. ఆయన మంత్రిణి నాయకురాలు నాగమ్మ. ఈమె సకల శాస్త్రాలు చదివిన విధుషీమణి. అస్త్ర శస్త్ర విద్యలలో ఆరితేరిన వీరవనిత. రాజ్యతంత్రం, ఎత్తులు..పై ఎత్తులు వేయడంలో దిట్ట. వీరు వీరశైవుల పక్షాన నిలిచారు. ఇక మాచెర్ల రాజు మలిదేవుడు. ఆయన మంత్రే బ్రహ్మనాయుడు. నిజానికి బ్రహ్మనాయుడే మొత్తం పల్నాడు రాజ్యాలకు పెద్దదిక్కు. రెండు రాజ్యాలు విడివడక ముందు రాజ్యాన్నంతటినీ తన బుద్ధిబలంతో, భుజబలంతో కాపాడాడు. విస్తరింపజేశాడు.బ్రహ్మనాయుడికి ప్రజల ఆదరణ..నలగాముడు, నరసింహులిద్దరూ, నాగమ దేవిని పూర్తిగా నమ్మి ఆమె గుప్పిట్లోకి వెళ్ళడంతో ఇరు పక్షాల మధ్య స్పర్థలు ఎక్కువయ్యాయి. చివరకు రాజ్యం రెండుగా చీలి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నలగామునికి గురజాల, సవతి పిల్లలయిన మలిదేవులకు మాచర్ల రాజ్యాలు భాగాలుగా వచ్చాయి. పల్నాడు నుంచి విడిపడ్డ మలిదేవులు బ్రహ్మనాయుడు నేతృత్వంలో మాచర్ల రాజ్యాన్ని సుభిక్షంగానే పాలించారు. వ్యవసాయం, పశుపోషణకు ప్రాధాన్యమిచ్చి రాజ్యంలో శాంతి, సౌభాగ్యాలను వర్ధిల్లచేశారు. బ్రహ్మనాయుడు తన సామాజిక సిద్ధాంతాలను కొనసాగించాడు. అట్టడుగు వర్గాలలో ప్రభువుల పట్ల తిరుగులేని ఆదరాభిమానాలను, మద్ధతును కూడగట్టాడు.ఇక్కడే ట్విస్టు...ఈ సమయంలోనే కథ మరో మలుపు తిరిగింది...*అదేమిటంటే.....*శ్రీమతి సత్యవాణి గారు చెపుతారు.-----------------------------------వంశవృక్షం---------పల్నాటి వీరచరితకి కారణభూతుడయినఅనుగురాజు, అతడిముగ్గురు భార్యలు------------1 వీరవాద్యాదేవి2 భూరమాదేవి3 మెలమానివీరవిద్యాదేవి (విజ్జలదేవి)కుమారులు1. పెదమలిదేవుడు2. పినమలిదేవుడు3. బాలమలిదేవుడుభూరమాదేవి కుమారులు1కామరాజు2నరసింగిరాజు3జెట్టిరాజు4పెరుమాళ్ళరాజుమైలమాదేవి ఒకే ఒక కుమారుడు1నలగాముడు
పల్నాటి మహాభారతం: -సత్యవాణి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి