సూరిడొచ్చాడమ్మా తూరుపు తెరల్లోనవెలుగులు తెచ్చాడమ్మా వేకువ వెల్లువలోనా
కోడిపిల్లల్లారా! కొక్కోరకో మంటూ కూయండి
కొష్టంలోని గోవల్లల్లారా! కమ్మని పాట ఇవ్వండి
పిచ్చుకల్లారా !కిచ కిచ మంటూ గుట్లోంచి రారండి
పిట్టల్లారా!రివ్వు రివ్వున నింగిలోకి స్వేచ్ఛగా ఎగరండి!
చెరువులోని తామల్లారా !చక్కగా విచ్చుకోండి
చెట్టు కొమ్మల్లారా! తలలు మెల్లగా విప్పండి
గడ్డి పరకల్లారా మంచు బిందువులు దులపండి
గాలి సమీరాల్లారా!చల్లగా గాలులు వీచండి
చిరు మొలకల్లారా ! నేల పెళ్ళగించుకు రండి
చిన్న పిల్లల్లారా! నిద్ర వదిలి మంచం దిగండి!
తూరుపు తెరల్లో: -డా.కందేపి రాణి ప్రసాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి