అచ్చులగేయం:-సత్యవాణి

 అమ్మ కోసం వెతికాడు బాబి
ఆకలేలేస్తోంది వాడికి
ఇక్కడున్నా
ఈత చెట్టు దగ్గర అంది అమ్మ
ఉడుతను చూస్తు
ఊడల మర్రిని దాటి
ఋషి గుండం అన్న కొలను దాటి
 ఎలపల ఉన్న చింతచెట్టు దాటి
ఏలాగో
ఒక లాగ
ఓపిగ్గా
ఔ వచ్చేసానంటూ
అందమైనదీ నా చేనూ అంటూ పాడుకొంటూ
అః ఒహోయ్ అంటూ అరుచుకొంటూ
అమ్మ దగ్గరకి చెరుకున్నాడు బాబి
               
కామెంట్‌లు