సూరీడు (-బాలగేయం ):- --ఎం. వి. ఉమాదేవి నెల్లూరు.


 సూరీడు మామయ్య సూటిగా వస్తాడు 

ఆరోగ్య సిరులన్ని హాయిగా ఇస్తాడు 


జీవులకు ప్రాణముల శక్తికారణ మితడు 

ప్రకృతిని రక్షించు పరమపావను డితఁడు !


పచ్చ పచ్చని పైరు పెరిగేటి బలముగా 

ఋతువులకు ఆధారభూతుడై మెలిగేను 


క్రిమి కీటకాలను అదుపులోనుంచుచూ 

రోగభయమును తొలిగే అగ్నిబింబమితడు


భగభగా మండేటి భానుతేజము ఘనము 

వనములూ జలములూ వేడి తగ్గించును 


తరువులే పెంచాలి తరముల్ కాపాడాలి 

పంచభూతాలని పరిరక్షణ చేయాలి 


సూర్యరశ్మిని వాడి ఇంధనము పొదుపుతో 

పల్లెలూ పట్నాలు పచ్చగా ఎదగాలి!


అతినీలలోహిత కిరణాల నుండియు 

కన్నులు,కాయము రక్షించుకోవాలి!


ఆదిత్య దేవుడా అందుకో వందనాల్ 

ఆరోగ్యమైశ్వర్య నిధులనే ఇవ్వవయ!