మహాన్నత నటుడు లింగమూర్తి.:-డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్


 అపురూప నటనాకౌశల్యం ,స్పస్టమైన ఉచ్చరణ,ఏపాత్రలోనైనా సునాయాసంగా పరకాయ ప్రవేశం చేసి ఆపాత్రకు జీవం పోసే విలక్షణ నటుడు లింగమూర్తి.

గుంటూరుజిల్లా తెనాలిలో ముదిగొండవారివంశంలో 10-10-1908 నవీరు జన్మించారు.బాల్యంలో చదువుతూనే ,'తెనాలిరామవిలాస్ సభ' 'యూనివర్సిల్ అసోసియేషన్ 'సంస్ఢల్లో స్త్రీ,పురుష పాత్రలు ధరించారు.అనంతరం స్ధానంనరసింహరావు,సి.యస్ .ఆర్ .గార్లతోకలసి 'భక్తతుకిరాం' 'పతితపావన' నాటకాలుఎంతో పేరుతెచ్చాయి.'కన్యాసుల్కం'నాటకంలో రామప్ప పంతులుగా వందనాటకాలపైగా ప్రదర్మించారు.

తొలిసారిగావీరు'భక్తతుకారాం'(1938)చిత్రంలోపీఠాథిపతిపాత్రపోషించారు.ఇంకా ఇందులో సి.యస్ .ఆర్ .-సురభికమలాబాయి.గాయని బాలసరస్వతి బాలనటి నటించారు.వాహిని వారిచిత్రాలకు సంభంధించిన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు.అలా 'వందేమాతరం' (1939)'చిత్రంలో డాక్టరుగా, 'నటులు నాగయ్యగారు వీరు ఒకరిని ఒకరు బావా అనిపిలు చుకుంటూ మంచిస్నేహంగా ఉండేవారు.అలా 'భక్తపోతన' ( )లో అజామిళుడుగా, 'యోగివేమన' లోఅభిరాముడుగా, 'స్వర్గసీమ' లో గంగులుగా, 'పెద్దమనుషులు' (1954) చిత్రంలో పత్రికాసంపాదకుడురామదాసుగా,ఉత్తమనటుడిగాప్రభుత్వసత్కారంపొందారు. 'దేవత'త్యాగయ్య'(1941)చిత్రంలోజపేశంగా,'సుమంగళి'(1940)'మహాకవికాళిదాసు'(1960)'బాటసారి'-'మహామంత్రి తిమ్మరుసు'(1962)'శ్రీకృష్ణతులాభారం' (1966) 'శ్రీకృష్ణావతారం'(1967)'శ్రీకాళహస్తి'-'పాండవవనవాసం(1968)ఈచిత్రంలో శకునిపాత్రకు వారుచూపిన నటన అమోఘం.అలా'నాఇల్లు'(1956) 'రామదాసు'(1964) వంటి యాభైపగా చిత్రాలలోనటించారు.వీరురాసిన 'వెంకన్నకాపురం' 'పెళ్ళిచూపులు' 'త్యాగం' మొదలగు నాటకాలు వీరికిమంచిపేరు తెచ్చిపెట్టాయి.1940లోవీరు'సినీటెక్నీషియన్స్అసోసియేషన్'స్ధాపకుల్లోవీరుఒకరు.ఆసంస్ధఅధ్యక్ష,కార్యదర్మపదవులు సమర్ధవంతంగా నిర్వహించారు.వీరు 'మంత్రదండం'(1951)చిత్రంలోమాంత్రికుడుగాఅపూర్వంగానటించారు.వీరునటించినచివరిచిత్రం'భాగ్యచక్రం'(1968) అనంతరం ఎన్నోచిత్రాలు వచ్చినా తిరస్కరించి తన అరవై వఏట చిత్రపరిశ్రమ నుండి తను'రిటైర్మెంట్'ప్రకటించారు.శృగేరిపీఠాధిపతివారువీరికి'నటయోగి'బిరుదుప్రదానం చేసారు.సన్యాసంశ్వీకరించినవీరు 24-1-1980 వతేదీన స్వర్గస్తులయ్యారు.