భవితకు బాట:- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 బాలబాలికలం మేమూ

భావి భవితలము మేమూ

దండలోనీ పూవుల లాగా

ఇంద్రధనువూ రంగుల లాగా

ఆనందంతో కలగలిసీ

మాటామంతీ కలుపుకొనీ

మమతాసమతలు చూపించీ

చదువూసంధ్యా నేర్చుకొనీ

చక్కని ఆటలు ఆడుకొనీ

మెచ్చిన పాటలు పాడుకొనీ

తల్లిదండ్రులను పూజించీ

గురువుల మాటలు పాటించీ

సత్యాహింసల బాటలొ నడిచీ

దేశసేవతో మేమంతా

భవితకు బాటను మేమేస్తాం

బాలబాలికలము మేమూ

భావి భవితలము మేమూ !!