ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు.....:------కె.ఎల్వీ.


 నలభై ఆరేళ్ల 

రేడియో తో

నాఅనుబంధం

వెనక్కి -

తిరిగి చూసుకుంటే ,


ఎన్ని జ్ఞాపకాలో ...

మరెన్ని అద్భుతాలో,

ఎందరిపరిచయాలో...

ఎన్ని చక్కని సమయా లో!


నన్నొక రా త గాడిని 

చే సింది ...రేడియో,

నన్నొక ఉపన్యాసకుడిని 

చేసింది ...రేడియో

నలుగురినీ పరిచయం చేసే 

అవకాశం ఇచ్చింది ...రేడియో!


కమ్మని లలిత సంగీతం 

ఆపాత వినసొంపైన 

సినీ సంగీతం ...

ఆస్వాదించే -

మధుర క్షణాలను 

అందించింది ....!


అందుకే .....

ఎన్ని నూతన ఆవిష్కరణలు 

మనముందుకు వచ్చినా ..

రేడియో స్ఠానం 

రేడియోదే ....

వినోద --విజ్ఞాన కార్యక్రమాల్లో 

రేడియో కి సాటి రాదు ఏదీ !

అందుకే ...

మన చేతిలో రేడియో ఉంటే 

సకల విజ్ఞానం 

మనతో ఉన్నట్టే .....!!


           -