బాలలు వారు బాలలు
నిరుపేద బాలలు
కూలి నాలి చేస్తారు
చినిగిన దుస్తులు వేస్తారు
పలుగు పార పడతారు
పనికి వారు పోతారు
కాయకష్టం చేస్తారు
కారం మెతుకులు తింటారు
ఆదమరచి ఉంటారు
గాడ నిద్ర పోతారు
వేకువ జామున లేస్తారు
వేపపుల్ల వేస్తారు
చన్నీటి స్నానం చేస్తారు
గంజి మెతుకులు తింటారు
వేలకు కూలికి వెళ్తారు
కాలము తోటి నడుస్తారు
రాత్రి బడికి వెళ్తారు
విద్యను వారు నేరుస్తారు
కాలం విలువ తెలుసుకుని
బ్రతుకు భారం మోస్తారు
బతుకు భారము(బాల గేయం)ఎడ్ల లక్ష్మి--సిద్దిపేట.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి