ప్రశ్న బట్టే జవాబు: -- యామిజాల జగదీశ్
 ఓ తుంటరి ఓ సాధువు వద్దకు వెళ్ళాడు.
"నేను ద్రాక్ష తినొచ్చా" అని అడిగాడు తుంటరోడు.
"అడగడానికేముంది. తప్పక తినొచ్చు" అన్నాడు సాధువు.
"అందులో కాస్త నీరు కలుపుకోవచ్చా?" 
"ఓ...తప్పకుండా"

" పులుపుకోసం వెనిగర్ కలుపుకోవచ్చ?"
"సందేహమెందుకు?"
"ఇవన్నీ కలిపితేగా మధువు. కానీ అది తాగితే మాత్రం తప్పంటున్నారుగా"

సాధువు ఆలోచించారు. తుంటరోడిని ఓ మాటడిగారు...

"ఇదిగో చూడబ్బా...నీ తలమీద కాస్త ఇసుక పోస్తే గాయమవుతుందా?"

"అదెలా అవుతుంది?"
"నీరు పోస్తే...."
"నీరు పోస్తే గాయమెలా అవుతుంది?"
ఇసుక నీరు కలిపి వేడి చేసి ఇటుకలా కాల్చి నీ తలమీద వేస్తే"
"గాయమవుతుంది"
"నువ్వడిగిన ప్రశ్నకు నా జవాబిదే" అన్నాడు సాధువు.
ప్రశ్నకు తగ్గట్టే జవాబుంటుందంటే ఇదే మరి.