పళ్ళతో ఇక పనేమిటి: -సత్యవాణి

  చెరుకు ముక్క చీల్చడం రాదు
తేగలు నమలడం రాదు
తాటి టెంక పీకడంరాదు
మామిడి టెంక చీకడం రాదు
బఠానీలు నమలటం రాదు
అటుకులు కట కటలాడించలేరు
కరకజ్జం కరకరలాడించలేరు
జంతికలు పర పరలాడించలేరు
మరందుకే పళ్ళకు జబ్బులు
పళ్ళ డాక్టరుకు జేబు నిండా డబ్బులు