నల దమయంతి.: --డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్ .

 నిషధ దేశాన్నిపాలించిన వీరసేనుని కుమారుడు నలమహరాజుసకల సద్గుణసంపన్నుడు,రూపసి, షట్ చక్రవర్తులలో రెండవవాడు.
విదర్భదేశాన్ని పాలించే భీముడు అనేరాజుకు దముడు అనే మహర్షివరాన జన్మించిన కుమార్తెకు దమయంతి అని,ముగ్గురు కుమారులకు దమ,దాంత,దమన అనిపేర్లుపెట్టారు.దమయంతి వివాహానికి స్వయంవరం ఆమె తండ్రి ప్రకటించాడు. హంసద్వారా నలమహరాజు అందచందాలు,వీర,దానగుణశీలత తెలుసుకున్న దమయంతి అతన్నిభర్తగా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. నలమహరాజుకూడా హంసద్వారా దమయంతి గురించి తెలుసుకుని ఆమెనే వివాహంచేసుకోవాలి అనుకున్నాడు.అలా స్వయంవరానికి నలుడు బయలు దేరుతుండగా,దిక్పాలకులు నలమహరాజును కలుసుకుని తమలో ఒకరిని దమయంతి వరించేలా రాయబారిగా ఆమె మందిరంలో నలుని ప్రవేశపెడతారు.నలునిచూసినఆమె తనమందిరం లోనికి ఎలారాగలిగారు అని అడుగుతూ,తమరు ఎవరు అంటుంది.దేవి అష్టదిక్పాలకులలో ఒకరిని నీవు వరించేలా నన్ను రాయబారిగా పంపారు,నేను నిషిధరాజు నలుడుడను  అనిచెప్పాడు.మహరాజా హంసద్వారా మీగురించితెలుసుకుని మిమ్ము వరించాలని నిశ్చయించుకున్నాను,కనక వారికోరికనెరవేరదు అని మరుదినం స్వయంవరంలో నలమహరాజును వరించింది దమయంతి.
అలా పన్నెండు సంవత్సరాలు కాలంగడచింది.వారికి ఇంద్రసేనుడు అనేకుమారుడు,ఇంద్రసేన అనేకుమార్తెకలిగారు.ఒకరోజు పొరుగుదేశం రాజు పుష్కరుడు వచ్చి జూదానికి ఆహ్వానించాడు.యుధ్ధానికి,జూదానికి ఎవరుపిలిచినా కాదనడం రాజధర్మం కాదుకనుక సహజంగా జూదప్రియుడు అయిన నలుడుమాయ జూదంలో పాల్గోని తనసర్వస్వం కోల్పోయాడు.తమపిల్లలను పుట్టింటికి పంపిన దమయంతి భర్తనలుని అనుసరించి అడవి బాటపట్టింది.
కొమ్మమీద పక్షులను పట్టుకోవాలని తనపంచెను వాటిపైకి విసిరాడు.పంచతోసహా పక్షులు ఎగిరిపోయాయి.దమయంతి తనచీరలోని కొంతభాగాన్ని యివ్వగా ధరించాడు నలుడు.భార్యను కష్టపెట్టడం ఇష్టంలేని నలుడు ఒరాత్రి ఆమెనువిడిచి వెళ్ళిపోయాడు.భర్తను వెదుకుతున్న దమయంతిని ఛేదిదేశ మహరాణి నందాదేవి ఆదరించి అంతఃపురంలో ఆశ్రయంకలిగించింది.అగ్నివ్యాపించిన అరణ్యంలో వెళుతున్న నలునికి 'కాపాడండి నారదునిశాపం వలన కర్రలాపడి ఉన్నాను నాపేరు కర్కోటకుడు నాగజాతివాడను'అని నలుని చూసి పిలవసాగాడు.అగ్నిబారినుండి కర్కోటకుని రక్షించాడు నలుడు. మరుక్షణం నలుని కాటువేసాడు కర్కోటకుడు.వెంటనే కురూపిగా మరగుజ్జు వానిగా నలుడు మారిపోయాడు. ఇదిఏమిటి సహాయంచేసినందుకు నన్నే కాటువేస్తావా'అన్నాడు నలుడ.మహరాజా బాధపడకుకలిపురుషుడునిన్నుబాధిస్తున్నాడుఇప్పుడునువ్వుబాహుకుని పేరుతో అయోధ్యపాలకుడైన ఋతుపర్ణుని కొలువులో చేరు,అతనికి జూదంఅంటేమహాయిష్టం . నీనిజరూపం ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను తలచుకో వస్తుంది'అనిచెప్పి వెళ్లిపోయాడు.
ఋతుపర్ణునికలసిన నలుడు తనకు అశ్వశాస్త్రం తెలుసునని,ద్యూత్యంకూడా వచ్చునని,వంటచేయడంలో అనుభవం ఉన్నదని చెప్పగా,ఋతుపర్ణుడు నలుని అశ్వపాలకుడిగా నియమించాడు.విదర్భరాజు దమయంతి,నలమహారాజును వెదకడానికి వేగులనుపంపగా,వారిలోసుదేవుడు అనేవాడు దమయంతి ఛేది దేశంలో సురక్షితంగా ఉందన్న వార్తతెలియజేసాడు.వెంటనే తనకుమార్తెను పిలిపించుకున్నాడు విదర్భరాజు.
ఎలాగైనా నలుని రప్పించాలని దమయంతికి మరలా స్వయంవరం ప్రకటించినట్లు ఋతుపర్ణునికి కబురు అందించాడు.రధసారధిగా బాహుకునితో బయలుదేరాడు.
మహప్రతివత దమయంతి బాహుకునిరూపంలోని నలునిగుర్తించి 'స్వామి మీరు యిక్కడకు రావడానికి చేసిన ప్రయత్నమిది.అనిపిల్లలను నలునికిచూపించింది. కన్నీరు కారుస్తూ నలుడు కర్కోటకుని తలచు కున్నాడు .వెంటనే అతని నిజరూపంవచ్చింది.దైవఅనుగ్రహంతో కలిపురుషుడు వదలడంతో పుష్కరునితో జూదం ఆడి తనరాజ్యం తిరిగి సంపాదించుకున్నాడు.ప్రజారంజకుడిగా పరిపాలన సాగించాడు.
జూదం అన్నికష్టాలకు మూలం అని ఈకథ మనకు తెలియజేస్తుంది.