మా పెరట‌ి పూదోట‌( *బాలగేయం*): - -అన్నాడి జ్యోతి,-- సిద్దిపేట

 మా పెరట‌ి లోన  పెంచినం
రంగురంగుల పూలచెట‌్లు
రకరకాల పూలచెట‌్లు 
మందారాలు,మల్లెలు
బంతులు చామంతులు
గోరింట‌లు గులాబీలు
కనకాంబరాలు  కాడమల్లెలు
సన్నజాజులు  విరజాజులు
పట‌్నంబంతీ పోకబంతులు
పట‌్టులా మెరిసే పట‌్టుకుచ్చులు
రంగురంగు పూలతో రమణీయం మాపెరడు
సీతాకోకచిలుకలకు ఆవాసం
 మా పూలతోట‌
ఝుమ్మంటు తుమ్మెదల 
ఝుంకార నాదాలు వీనులకు విందు
కనువిందు చేసేను మాపూలతోట‌
మనసుకిచ్చును హాయి మాపూలతోట‌
ప్రశాంతతకు నెలవు మాపూలతోట‌
మీ పెరట‌ిలో మీరు పెంచండి చెట‌్లు
ఆహ్లాదమును పొంది హాయిగుండండి