బడిగేటు తెరిచారుక్లాసు రూమ్ తెరిచారు
పిల్లలు బయలుదేరారు
చదువు ఇష్టపడ్డారు
వీపున బ్యాగు
జారుతున్న లాగు
చదువుకుంటే బాగు
చదవకుంటే నాన్నకు తిక్కరేగు
అ ఆలు దిద్దితే ఆలోచన మారు
ఇ ఈ లు దిద్దితే ఇష్టాలు తీరు
ఉ ఊలు దిద్దితే ఊతం దొరుకు
ఋ ఋలు దిద్దితే ఋణ0 తీర్చుకోవచ్చు
ఎ ఏలు దిద్దితే ఏనుగులా ఉండొచ్చు
ఐ దిద్దితే ఐశ్వర్య0 పొందవచ్చు
ఒ ఓలుదిద్దితే ఒంటె నెక్కవచ్చు
అం దిద్దితే అందలం ఎక్కవచ్చు
ఆహా దిద్దితే ఆహారం పొందవచ్చు
అచ్చులలో ఇన్ని లాభాలు ఉంటే
హల్లులలో ఇంకెన్నో
అందుకే నేర్చుకోండి అన్ని
తీర్చ0డి తలిదండ్రుల కోరికలన్నీ!!
బడికి వెల్దాం: --కవిత వేంకటేశ్వర్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి