పక్షులు:-వురిమళ్ల సునంద,ఖమ్మం
 పల్లవి:
పక్షులండి పక్షులు భలే భలే పక్షులు
ఆకసాన విహరించే అందమైన పక్షులు
నింగికి తామతిథులు తరువుల
తనయులు
 *!! పక్షులు!!* 
 *చరణం 1* 
దొరికిందే తిని బతికే తాపసి రూపాలు
తనకంటూ దాచుకోని నిస్వార్థ జీవులు
కలిమిడిగా తిరిగే ఐకమత్య 
ప్రాణులు
సొంత గూడు కట్టుకునే ప్రతిభా
మూర్తులు
 *!! పక్షులు!!* 
 *చరణం 2* 
మదిని దోచు అందాల చేయును కనువిందు
అలరించే వింత శబ్దాల చేయును వీనులవిందు
ఎండైనా వాననైనా సమముగా స్వీకరించు
పక్షుల మించి గురువులింకెందు  కనిపించు
 *!! పక్షులు!!*
కామెంట్‌లు