అమ్మాయిలు ధోకా తింటున్నరు....పోలీసులు లంచాలు తింటున్నరు...పొలిటీషియన్స్ కోట్లు తింటున్నరు..రైతులు విషం తింటున్నరు...యువకులు బలం కోసం మందులు తింటున్నరు....ఇంకెక్కడున్నై ఆకలి చావులు...నా దేశం ప్రగతిలో ముందంజలో ఉంది...రైలు ప్రమాదాలను నివారించడం చేత కాదు..కానీ బుల్లెట్ రైళ్ళు కావాలి....ఉండటానికి ఇల్లుండదు...కానీ అందరూ శౌచాలయం కట్టుకోవాలి...గ్రామాల్లో కరెంటుండదు....కానీ డిజిటల్ ఇండియా చేస్తాం...జేబులో రూపాయుండదు కానీ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి....కడుపుకి గంజి కూడా గతి లేదు...కానీ అందరూ యోగా దినం జరుపుకోవాలి..ఒక్క ఏటియంలో కూడా డబ్బులుండవ్..ఇందేంటనడిగితే దేశద్రోహి అనిపించుకోవాలి.ఎవడ్నైతే ఎన్నుకుంటామో...వాడితోనే తన్నించుకోవాలి....దేశం మారుతుంది....మారుతోంది...మారుతూనే ఉంది....ఎంతలా అంటే....జీవితాంతం బాక్సింగ్ చేసి కష్టపడి సంపాదించిన మేరీకోమ్ కన్నా...ఆమెపై సినిమా తీసిన ప్రియాంక చోప్రా వంద రెట్లు సంపాదించినంత....
నా దేశంలో ఆకలి చావులు లేవు:--:యడ్ల శ్రీనివాసరావుMSw,MTel: విజయనగరం జిల్లా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి