గేయ తరంగాలు-1--బాలలం-బాలలం:-డాక్టర్. కొండబత్తిని రవీందర్-- కోరుట్ల. జిల్లా. జగిత్యాల-9948089819
బాలలం బాలలం
భరతమాత బిడ్డలం
భావిజాతి పౌరులం
ప్రగతి కోరె పాపలం

సమత మమత కాంతులం
శాంతి మాత మువ్వలం
భగతసింగ్ తమ్ములం
భరత మాత నవ్వులం

ఆటలెన్నొ  ఆడెదం
పాటలెన్నొ పాడెదం
కల్లలన్ని మానుకొని
ఎల్లర మొకటయ్యెదం

నేడు మనం పిల్లలం
రేపు మనం యోధులం
జాతికీర్తి నిలుపుదాం
జాతి మేలు కోరుదాం



కామెంట్‌లు