కందము :
*దిక్కెవ్వరు ప్రహ్లాదుకు*
*దిక్కెవ్వరు పాండుసుతుల | దీనుల కెపుడున్*
*దిక్కెవ్వరు యహల్యకు*
*దిక్కెవ్వరు నీవె నాకు | దిక్కువు కృష్ణా !*
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుని కి దిక్కెవ్వరు? పాండు రాజు కొడుకులైన పంచపాండవుల కు దిక్కెవ్వరు? దీనులు, ఎవ్వరూ తోడులేని వారికి దిక్కెవ్వరు? గౌతముని భార్య ఐన అహల్య కు దిక్కెవ్వరు? వీరందరికీ నీవే దిక్కై నిలిచి వారందరినీ కాపాడావు కదా కృష్ణా!!! నాకు కూడా నీవు తప్ప వేరెవ్వరూ దిక్కు లేరు. కనుక నీవే నన్ను కాపాడాలి సత్యభామా వల్లభా!!!.....అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*నీచే సృష్టించబడిన ఈ జగత్తు మొత్తానికి నీచే ఆధార భూతుడవు. నీవే దిక్కు. నేను నీద్వారా నిన్నే నమ్ముకున్న వాడిని. నువ్వు తప్ప ఇంకెవరూ నాకు తెలియదు. "నీవు తప్ప ఇతః పరంబెరుగ" "కరుణ జూడు నిను నమ్మిన వాడు గదా..."*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి