*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౫౮ - 58)

 కందము :
*స్తంబంమున వెడలి దానవ*
 *డింభకు రక్షించునట్టి | రీతిని వెలయన్*
*అంభోజనేత్ర జలనిధి*
*గంభీరుంఁడ నన్ను గావు | కరుణను కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
ఓ లక్ష్మీ రమణా, సముద్రములా గంభీరమైన వాడా, తామరపువ్వుల వంటి కన్నులు కలవాడా,  స్తంభములోనుంచి బయటకు వచ్చి హిరణ్యకశిపుని కొడుకైన ప్రహ్లాద కుమారిని రక్షించిన వాడివి. అంత దయమయుడవైన నీవు నామీద కరుణ చూపించి కాపాడు కృష్ణా !!!....అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*అక్రూరవరదా,  గజరాజ రక్షకా, నీవే అంతా. నీదే అంతా. ఈ విషయం నువ్వే ఎన్నోమార్లు చెప్పినా, అది తెలుసుకుని అర్ధం చేసుకునే తెలివితేటలు మాకు లేవు. ఎందుకంటే, నీ మాయలోనే వున్నవాళ్ళము కదా, పరమాత్మా. అందువల్ల, నీ మాయను నీవే తొలగించి, నీ సాయుజ్యం ప్రసాదించు, ఆంజనేయ వరదా!!..."*
.....ఓం నమో వేంకటేశాయ
[
Nagarajakumar.mvss