ఆకలి వేసిన కుందేలు
ఆహారం కోసం వెళ్లింది
నచ్చిన దుంపలు తెచ్చింది
చక్కని పొదలో దాచింది
కొంచం కొంచం తింటుంది
మిగిలిన గాసం దాస్తుంది
నక్క ఒకటి పసిగట్టింది
గాసమంత కనిపెట్టింది
కుందేలులేని ఓ సమయాన
దొంగతనము మొదలెట్టింది
ఎప్పటికప్పుడు మాయంచేస్తు
ఎరగనట్టుగా చూస్తోంది
అయ్యో! పాపం కుందేలు
దిగులుతొ ఆలోచిస్తుంది
ఉపాయమొకటి పన్నింది
అమలుకు సిద్దం అయ్యింది
ఎలుగుబంటిపొద దగ్గరచేరి
గాసంకొంత దాచింది
నక్క పసిగట్టి వెళ్ళంది
ఎలుగుబంటి పొద కదిపింది
ఎలుగుబంటి కోపంతో రగిలి
నక్కను కొరుకుతు రక్కింది
అమ్మా! అయ్యా! అంటూనక్క
దూరంగా పారిపోయింది
కుందేలు చప్పట్లు కొట్టింది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి