మమతలమ్మ పదాలు:మమత ఐల-హైదరాబాద్-9247593432
ఆశకంతే లేదు
ఒకటితో సరిపోదు
తృప్తి లేనే లేదు
ఓ మమతలమ్మ

ఒకరిపై ద్వేషాలు
ఒకరిపై మోసాలు
ఎడతెగని దీసాలు
ఓ మమతలమ్మ

కరువులుండిన నాడు
పరువు లుండెను చూడు
రెండు లేవీనాడు
ఓ మమతలమ్మ

ఆస్తి పాస్తుల పోరు
బతుకుతోర్వను లేరు
బంధమని చెబుతారు
ఓ మమతలమ్మ

మాటలో ముత్యాలు
మనసులో ద్వేషాలు
మాయ కప్పిన సిరులు
ఓ మమతలమ్మ

జీవితం ఒక నావ
ప్రయాణికులకు తోవ
ఎక్కేరు నీ నావ
ఓ మమతలమ్మ

సాధనం నీ నౌక
వారి గమ్యం దాక
వచ్చేరు నీ వెనుక
ఓ మమతలమ్మ


కామెంట్‌లు