పాట జానపదం ( వెంకటేశుడా ):-మమత ఐల-హైదరాబాద్ 9247593432
పల్లవి// చిన్న చిన్న రాళ్ళనిడిసి వెంకటేశుడా
            ఏడుకొండలెక్కినావా వెంకటేశు డా
            నువ్వు ఏడు కొండలెక్కినావ వెంకటేశుడా ..//2// 
చ //   కొండకింద నీ భక్తులు వెంకటేశు డా
          కోట్ల కోట్ల జనముండిరి వెంకటేశు డా
          కష్టాలను కడగళ్ళను వెంకటేశు డా
         కళ్ళలోనె దాచిరయ్య వెంకటేశు డా
          కళ్ళనిండ నీవేర వెంకటేశు డా
         కష్టమింక నీ దయర వెంకటేశు డా
      మా కష్టమింక నీ దయర వెంకటేశు డా  // చిన్న చిన్న 2// 

చ//   రాయల వారేలినపుడు శ్రీనివాసుడా 
         రతనాల రాసులట శ్రీనివాసుడా 
        నిరుపేదలు లేరట శ్రీనివాసుడా 
         పాలన బ్రహ్మాండమట శ్రీనివాసుడా 
        అన్న

మయ్య కీర్తనతో శ్రీనివాసుడా 
        ఆదమరచి నిదురబోకు శ్రీనివాసుడా 
       సీమలోన వెలసినట్టి శ్రీనివాసుడా 
       చూపుమింక నీదయను శ్రీనివాసుడా ....

చూపుమింక నీ దయను శ్రీనివాసుడా
చూపుమింక నీ దయను శ్రీనివాసుడా
చూపుమింక నీ దయను శ్రీనివాసుడా

కామెంట్‌లు