పద్యాలు(సమస్యా పూరణాలు)-మమత ఐల-హైదరాబాద్-9247593432
కం
క్రూరత్వము విడనాడక
వారుసలుప నేమి ఫలము వైరము తోడన్
తీరని నష్టంబౌ స్వీ
*కారము గల మాట మెప్పు గలదెల్లపుడున్*

 సమస్యా పూరణం
కం
శ్రీ రామునితో యుద్ధము
జైరామని పలికి గెలువ జగమే మెచ్చెన్
మారుతి తీర్చెనువెత మమ
*కారము గల మాట మెప్పు గలదెల్లపుడున్*

 సమస్యా పూరణం
కం
కుంచాలను పండించిన
కంచములో మెతుకు లేక గడిపెడి వారిన్
పంచన నుండక యీ ధన
*వంచకులకు మాధవుడిడు వరమోక్షమ్మున్*

సమస్యా పూరణం
ఆ.వె
వెండితెరకు బోను దండి ముస్తాబుతో
వేచి చూసెనుచెలి ప్రియుని కోరి
జాడ లేడనుకసి జారేటి జడలోని
*పూలు సెగలఁ బొగలఁ బుక్కిళించె*

అంశం:-- కరోనా ( ఇల కల వల తల) పదాలతో

కం
ఇలలో గలగల సాగుచు
కల కలములు రేపుచుండె గాని కరోనా
వలలో చిక్కిన రోజున
తల దించుక మగ్గిపోవు ధరలెల్లడలన్

కం
ఇలలో జనులెందరినో
కలవర పెడుచుండెను కలికాలమహిమతో
వలలో బంధించ గలమ
తలకిందులు చేసె గాలితగిలి కరోనా