మునుపు మూసీ నది ముంచేయ వరదతో
సకల యత్నము జేసి శాంతి కొరకు
సింహవాహిని మాత సిరిగల తెల్లికి
గుడికట్టి పూజించ గుర్తు గాను
శాంతించి నదిమాత సర్వశుభములిచ్చి
విస్వసించిన జనావేధనలను
తొలగించు చుండగా ధూప దీప ములిడి
బోనాలతో వచ్చె భువిన జనులు
జాతరే మొదలాయె జనసందడేర్పడి
నాటి నుండి మొదలు నేటి వరకు
అమ్మ వారికి యతి యాప్తసోదరుడైన
పోతురాజును భక్తి పూర్వకముగ
కొలచి వేషాలనే కూర్చి జాతరజేయ
యాషాఢమాసాన యవని మెరిసి
వర్థిల్లె నుత్సవం వనితలపండగై
హైదరాబాదున హంగు తోడ
సింహాలదర్వాజ సంహరించేరూపు
జాజురంగును వేసి జాతరలతొ
తలచేరు తల్లిలాల్ దర్వాజ పేరును
నైజాము నిర్మించినందు వలన
ప్రఖ్యాతి గాంచెను ప్రతివత్సరంబున
సందడి బోనాల సంబరాలు
ఆ.వె
పాలు నెయ్యితీపి పరమాన్న బోనము
వేప కొమ్మ శాఖ పెట్టి వేడ
భక్తితోడ జనులుబలగమై వచ్చేరు
మనసు పెట్టి వినుడి మమత మాట
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి