శ్రీకర శుభకర గౌరీశంకర
గంగాధర హర హారతి!
నిఖిలమునేలే నీలకంఠ
రాజేశ్వర ఈశ్వర లయకార
బసవేశ్వరుడ భక్తవత్సల
హరిహర గనుమా హారతి!
శ్రీకర శుభకర గౌరీశంకర
గంగాధర హర హారతి!
మోక్షమునిచ్చే ముక్తీశ్వర
సర్వేశ్వర ఈశ్వర సతిహితుడ
పులి చర్మాంబర భోళాశంకర
గరళకంఠుడా హారతి!
శ్రీకర శుభకర గౌరీశంకర
గంగాధర హర హారతి!
విశ్వంభరుడ విభూతి దారి
నందివాహన నటరాజ
త్రిశూలనాథ ముక్త్యాలేశ్వర
ముదముతొ గైకొమారతి!
హారతి.... హారతీ... మంగళహారతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి