కం
పాలేవో నీళ్ళేవో
బాలామణి ప్రేమనటన పరికించుమురా
బాలక మైమరవకురా
గాలానికి చిక్కబోకు గతితప్పెదవో
కం
ప్రేమన్నది మాయకదా
పామరులను జేయుచుండె పరిహాసముతో
యేమని చెప్పుదు బాలక
రోమాలే జలదరించు లోతుగ జూడన్
కం
నిస్వార్ధంబేడుండెను
సుస్వాగతమే పలికెడి సుజనులు గలరా
సుస్వర గీతాలాపన
కు స్వరమైతొలచిమదిని కుంపటి జేయున్
కం
మాటకు విలువీయక నీ
మాటల కర్దమును మార్చె మనుజులు గలరే
వేటకు దైవంబేసరి
దీటుగ రోగాలనిచ్చి దించును తిక్కన్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి