జాజీరీ ఆటా..;; పాటా :-రాజేష్ మిట్టపెల్లి..9441672957

 గత కొన్ని రోజుల క్రితం  పల్లెటూరులో జాజీరు ఆటను ఎంతో ఆడంబరంగా జరుపుకునేవారు. తెలిసీ తెలియని వయసులో స్నేహితులంతా కలిసి  జాజిరీ ఎలా ఆడాలి అని ప్లానింగ్ చేసుకునే వాళ్ళం చప్పుడు రావడానికి రెండు కర్ర ముక్కలను తయారుచేసుకునే వాళ్ళం, మొదటి రోజునుండి, లాస్ట్ రోజు వరకు ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా, ఏదో తెలియని సంతోషం తో, ఆడుకునే వాళ్ళం ఈ జాజిరి ఆట తొమ్మిది రోజులు ఉంటుంది ఈ తొమ్మిది రోజులు, క్రమం తప్పకుండా ఆడుకునే వాళ్ళం ఊరు మొత్తం తిరుగుతూ కర్రలతో చప్పుడు చేసుకుంటూ, పాటలు పాడుతూ డబ్బులు, బియ్యం అడిగే వాళ్ళం ఇలా రోజు ఆడిన ఆట కు కొంత మొత్తం డబ్బులు, కొంత మొత్తం బియ్యం, కొంత మొత్తం వడ్లు వచ్చేవి లాస్ట్ రోజు బియ్యం, వడ్లు అమ్మే వాళ్ళం వచ్చిన పైసలను అందరం సమానంగా పంచుకొని హోలీ పండుగకు కావలసిన రంగులు కొనుక్కొని హోలీ పండుగ వేడుకలు జరుపుకునేవారు. స్త్రీలు కూడా ఎంతో ఆడంబరంగా జాజిరి ఆటలు ఆడి, పాటలు పాడి ఎంతో ముచ్చటగా వేడుకలు జరుపుకునేవారు. ఈ తొమ్మిది రోజులు ఆడిన జాజిరి ఆటను మళ్ళీ వచ్చే వరకు ఆడిన ఆటను గుర్తుకు తెచ్చుకునే వాళ్ళం. సాయంత్రం 6 గంటలకు మొదలుకొని రాత్రి 10 గంటల వరకు ఆటను కొనసాగించి వాళ్ళం . వరస అయిన వారి పై రంగులు పూసుకుని హోలీ వేడుకలు జరుపుకునేవారు. ఈ ఆటలు ఆడేటప్పుడు పాడే పాటల్లో ఎంతో అర్థం ఉండేది, వింటుంటే వినాలి అనిపించేది. 
   కానీ  ఈ రోజుల్లో ఇలాంటి ఆట సంబరమే కరువైపోయింది ఎక్కడో ఒకచోట మాత్రమే ఆడుతున్నారు. ఈ కాలం పిల్లలు అంతా స్మార్ట్ ఫోన్, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు బానిసలుగా మారి, ఆట లో ఉండే చిన్న చిన్న తీపి జ్ఞాపకాలను మరిచిపోతున్నారు. రాను రాను పల్లె సంస్కృతి, దిగజారి పోతుంది. Covid 19 కారణంగా ఆడాలని ఉన్నా ఆడ లేని పరిస్థితి పల్లెటూరు  లోనే అక్కడ అక్కడ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. నగర వ్యవస్థలో అసలు జాజిరి అంటేనే తెలియకుండా పోయింది.  నేటి నేటి కాలం పిల్లలకు పల్లెటూరు వ్యవస్థ గురించి, పల్లెలలో ఆడే ఆటల గురించి పెద్దలు వివరించాలి. అప్పుడే పల్లెల గురించి పల్లెల  ఆటల గురించి తెలుసుకుంటారు. ఒక విధంగా పల్లెటూరు ల పై వారికి ప్రేమ కలుగుతుంది. స్మార్ట్ ఫోన్ అవగాహనతో పాటు, పల్లెటూరుల గొప్పతనం గురించి, పల్లెటూరు ఆటల గురించి వివరించండి.
               
కామెంట్‌లు