కాకి (బాల గేయం)-ఎడ్ల లక్ష్మి సిద్దిపేట
కవ్వర కవ్వర కాకమ్మ
నే చెప్పే మాట వినవమ్మ
నలుపు రంగని కాకమ్మ
నామూశి కాకు కాకమ్మ

కల్మషం లేని కాకమ్మ
కావు కావు మంటూ వస్తావు
గోడ మీద వాళ్లు తావు
చుట్టాల కబురు తెస్తావు

ఆకులు లేకుంటే కాకమ్మ
లోకమే లేదంట చూడమ్మ
నీవు వచ్చి తింటేనే కాకమ్మ
పెద్దల ఆత్మకు శాంతమ్మ

కాకులు లేని ఊరు లేదు
జనాలున్న చోటే ఉంటావు
జగతి అంట తిరుగుతావు
వేయి ఏళ్ళు బ్రతుకుతావు