ఊతం:-కవిత వేంకటేశ్వర్లు
చేతికి ఊతం
నడకకు నేస్తం
ఒదిగిపోవు హస్తం
కొండంత బలం

పుస్తకం హస్తభూషణమైనట్టు
ముదిమిన ముచ్చటైన మైత్రి
చేతి కర్రట్టు
నదికి వారధిలా 
పేదకు పెన్నిధిలా
వయో వృద్దులకు ఆసరా
వయోజనులకు తోడురా

పక్క నెవరు లేకున్నా
చేయిపట్టి నడపకున్నా
భయం లేకుండా బయటికి రావాలన్నా 
మెల్లమెల్లగా తిరగాలన్నా
మిత్రులను కలవాలన్నా
సాయంకాలం షికారు చేయాలన్నా
నలుగురితో కలిసి తేనీరు
సేవించాలన్నా
చేతిలో చెంతన ఉండాలి ఉతకర్ర
అది ఉంటేనే పనిచేయు బుర్ర!!
                  

కామెంట్‌లు