సాలీడండి సాలీడు
ఎనిమిది కాళ్ళ సాలీడు
ఏవైపుకైనా కదులుతుంది
ఎక్కడైనా తన గూడు కడుతుంది
బూజుకర్రతో దులుపుతు ఉంటే
ఏమూలనో అది నక్కుతోంది
చీపురుతో ఎంత సింగారించినా
కాసేపటికే మళ్ళి కడుతోంది
ఎన్నిసార్లు దాన్ని తరిమేసినా
మళ్ళీ తన గూళ్ళు కడుతోంది
సాలీడుకు విసుగు రాదండీ
సాలీడుకు నిరాశ లేదండీ
సాలీడు పట్టుదల ముందు
నేనైతే ఓడిపోయానండీ !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి