అది జయపురం. ఆ ఊళ్ళో ఒక నడివయస్కుడు. ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో చదువుకున్న చదువునంత మనసులో పెట్టుకుని తానొక జ్ఞానవంతుడిగా గొప్పలు చెప్పుకుంటూ ఉండేవాడు. తనక తెలియనిదంటూ లేదని, ఎవరికైనా సందేహాలుంటే తననడిగితే ఇట్టే వాటికి జవాబులు చెప్తానని అంటుండేవాడు. తనకు తెలియనిదంటూ ఏదీ లేదని తన గురించి తనకు తానే అడిగినా అడగకున్నా చెప్పుకుని తిరిగేవాడు.
ఈ విషయం ఓ పెద్దాయనకు తెలిసింది.
ఆయన ఇతని వద్దకు వచ్చి "నీ గురించి ఆ నోటా ఈ నోటా విన్నాను. నీ అంతటి వాడు లేడని అనుకుంటున్నారు. ఏదైనా చేసీ చూపించగలవని చెప్పుకుంటు న్నారు...చాలా సంతోషంగా ఉంది నాకు. మన ఊళ్ళో ఇంతటి ప్రతిభావంతుడు ఉండటం ఆనందమే" అన్నారు.
పెద్దాయన మాటలన్నీ విన్న ఆ నడివయస్కుడు "అవునండి నాకన్నీ వచ్చండి" అని గొప్పలు చెప్పుకున్నాడు. "మీకేదైనా అనుమానముంటే పరీక్షించుకోవచ్చు" అన్నాడు.
అప్పుడా పెద్దాయన అక్కడి ఆవరణలో ఉన్న ఓ గులాబీ చెట్టులోంచి ఓ మొగ్గ తెంచి నడివయస్కుడికిచ్చి దీన్ని పూయించండి అన్నారు.
నడివయస్కుడు ఓస్ ఇంతేనా ఆని చాలా నిర్లక్ష్యంగా పెద్దాయన నుంచి గులాబీ మొగ్గ అందుకుని దాన్ని పూయించడానికి నానా తంటాలు పడ్డాడు. కానీ ఫలితం లేకపోగా మొగ్గకున్న రేకులన్నీ ఒక్కటొక్కటే రాలిపోయాయి.
పెద్దాయన నడివయస్కుడి అజ్ఞానాన్ని తలచుకుని "సరేగానీ బాబు, ఇదిగో మీ ఇంటి ఆవరణలోనే ఉన్న గులాబీ మొక్కలో మరో ఆరేడు మొగ్గలున్నాయి. అవన్నీ రేపుదయానికల్లా ఎలా వికసించి పరిమళాన్ని వెదజల్లుతాయో చూడు. నేను రేపు ఉదయం వస్తానులే" అని వెళ్ళిపోయారు.
మరుసటిరోజు సూర్యోదయమైంది. పెద్దాయన ముందురోజు చెప్పినట్లే నడివయస్కుడి ఇంటికి వచ్చారు. నడివయస్కుడిని కలిసి గులాబీ మొక్క దగ్గరకు తీసుకుపోయి అక్కడ వికసించిన మొగ్గలను చూపించారు. "వాటిని ఎవరు పూయించారు? నువ్వో నేనో కాదుగా ? తానుగా వికసించినవే అవి" అని పెద్దాయన చెప్పేసరికి నడివయస్కుడి నోటంట మాట లేదు.
అంతే ఆరోజు నుంచీ అతను తనకంతా వచ్చని, ఏదైనా చేయగలనని చెప్పుకునే గొప్పలు మానుకున్నాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి