ఇంటిముందు చెట్లు-- ఇంటివెనుక చెట్లు
బాటపక్కన చెట్లు-- కోటపక్కన చెట్లు
గుడిలోన చెట్లు-- బడిలోన చెట్లు
పూవులనిచ్చే చెట్లు-- కాయలనిచ్చే చెట్లు
పండ్లనిచ్చే చెట్లు-- కూరలిచ్చే చెట్లు
మందునిచ్చే చెట్లు-- మోకులనిచ్చే చెట్లు
కూడునిచ్చే చెట్లు-- గూడునిచ్చే చెట్లు
గుడ్డనిచ్చే చెట్లు-- కలపనిచ్చే చెట్లు
గాలినిచ్చే చెట్లు-- వానలిచ్చే చెట్లు
భూమిని కాపాడే చెట్లు-- జీవులను కాపాడే చెట్లు
అందుకే మనమంతా
పచ్చని చెట్లను అవనికి
పచ్చల పతకపు హరితహారాన్ని
నజరానాగా ఇద్దాం !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి