ప్రొద్దుతిరుగుడు పూవు -(బాల గేయం )--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

పొద్దున్నే నిద్దుర లేచింది 
ప్రొద్దుతిరుగుడు పువ్వు  
పొడిచే భానుడిని చూసింది 
సద్దు చేయని పువ్వు !

ఎటుపోతే అటు తిరిగింది 
పసుపు రేకుల  పువ్వు  
సూర్యుడితో పందెమేసింది 
మధ్య విత్తుల పువ్వు !

నడినెత్తిన రవిని చూసింది 
బద్ధకం లేని పువ్వు 
మెడఎత్తి నిటారయ్యింది 
బడిపిల్లయి పాఠం నేర్చింది!

పడమరలో గమనించింది 
వడలి పోయిన పువ్వు 
భానుడికి వీడ్కోలిచ్చింది 
అలిసినట్టి ఈ పువ్వు !

చుక్కలతో జట్టు కట్టింది 
పొద్దుటి కష్టం మరిచే పువ్వు 
చందమామతో సేద దీరింది 
వెన్నెల్లో వెలిగే పువ్వు !!

కామెంట్‌లు