సందడి....!!:---------డా .కె .ఎల్వీ .హన్మకొండ .
తాత బాటలో 
నడిచేస్తున్నా 
కథలు చెప్పడం 
నేర్చుకున్న ...!

ఆంగ్లంలో -
కథచెప్పి ....
చర్చి పెట్టిన 
ఆన్లయిన్ పోటీలో 
రెండోబహుమతి 
కొట్టేసా ....!

ఆన్లైన్ క్లాసులు
అయిపోయాయి
పరీక్షల పర్వం
పూర్తి చేసా....!

ఆటపాటలకు
అనుమతి వచ్చిన్ది,
దాచిన బొమ్మలు 
బయటకి తీసి 
అక్కతో కలసి 
ఆడుకుంటా .....!

అల్లరి పనులు 
మానుకుంటా !!