వెచ్చగా పొత్తిళ్లలో
అమ్మతో జ్ఞాపకాలు
పుట్టింటి నవ్వుల్లో
వెలలేని నవరత్నాలు!
ఇరుకైన ఇంటిలోనే
విశాలమైన మనసులు
చవకరకం దుస్తుల్లోనే
చక్కని సంప్రదాయాలు!
అడుగడుగునా అమ్మకు
సంధించే బాల్యప్రశ్నలు
అలవోకగా పిల్లలకు
జవాబులిచ్చే ఓపికలు !
చెమ్మగా ఉన్నకుచ్చిళ్ళు
కాఫీపొడి వాసనతో
అమ్మవొడిలో వాటాలు
మా తోబుట్టువులతో !
ఉపవాసం తర్వాతయినా
విస్తరిలో తలోముద్దను
పెట్టందే అమ్మెపుడయినా
తిన్నదని అనుకోలేను!
ఆస్తులు అంతస్తులు
లేకున్నా నిండునవ్వులే
అమ్మనాన్నల హృదయాలు
కార్తీకపున్నమి దీపాలే!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి