దూప:- సరోజన

 పల్లె అంటేనే సూడ సక్కటి గుడిసెలు,గుడిసె సుట్టు అలుకు ఊత,ఆకిట్ల సుద్దతోని ఏసిన ముత్యాలాంటి ముగ్గులు.సుట్టు పచ్చటి పొలాలు, గుడిసె సుట్టురా సెట్ల తోని సల్లటి గాలి.
ఇగ తాగటానికి ఇంటి ముంగటి సల్లటి మంచిల్ల బాయి(బావి)ఇగ ఈ బాయిల నీళ్లు సేదుటానికి  నులక తోని ఏసిన తాడు.ఇగ ఆ తాడుకు ఓ.సిన్న బొక్కెన కట్టి నీళ్ల సేదుకునేది..
ఇగ గా బాయిల నీళ్ల సల్లగా,తియ్యగ ఉండేది.ఆరెండ కాలం ల గి బాయిల నీళ్లు సేదుకొని  దొసిట్ల వట్టుకొని తాగితే ఎంత సల్లగా ఉండేది. ఎండకు సచ్చిన పానం మల్ల వడ్డట్టు ఉండేది..
ఇగ తాడు తోని నీళ్లు సేదితే పెయ్యిల కొవ్వు కరిగి పానం కూడా మంచిగ ఉండేది.
లగ్గం ల కురాళ్లు వట్టుటానికి కూడా మంచిళ్ల బాయి కాడికి పొయ్యి..ఆ బాయికి కంకుణం కట్టి పసువ్ కుంకుమ,పత్తిగింజలు ఏసీ ముత్తైదువులు అందరు పసువ్,కుంకుమ పెట్టుకొని అయిదు పటువ (కుండ)లల్ల నీళ్లు సేదుకొని డప్పుల సప్పుడు తోని మంగలారతి ముందట వట్టుకొని కురాళ్లు వట్టేది..
ఇగ ఇప్పుడు బాయిలు ఎక్కడ ఉన్నాయి.బోరింగ్ల నీళ్లు  తీసుకొని పోవట్టిరి.
ఇగ ఇప్పుడైతే అందరు సుఖాన వడ్డరు.పట్నంల ఏడ సూద్దాం అన్న కూడా ఒక్క బావి కనబడుత లేదు.అందరు బోర్ లు ఏసీ..మోటర్లు వెట్టుడేనాయే..ఇగ ఒక్క సిచ్చు ఎత్తే సాలు నీళ్లు మోటర్ల కెల్లీ అచ్చుడేనాయే.. పట్నంఓళ్లను సూసి పల్లెలల్ల కూడా ఉన్న బావి ని కూడిపి బోర్ లే ఏసుకోవట్టిరీ.. గిట్ల బోర్లు సెయ్యంగా ఉన్న బావి ల ఎండాకాలం అచ్చింది అంటే ఎండలు ముదిరితే బావి ల నీళ్లు ఊట లేకుండా ఎండి పోవట్టె..ఇగ సల్లటి మంచిళ్లు దాగుదాం అంటే దొరకుండ కావట్టే..మంచిళ్లను కూడా కొనుక్కోని తాగుడు కావట్టే..ఇన్ని దినాలు మందులు ఏసీ పండిచ్చిన బువ్వే తింటన్నం అనుకుంటే ఇగ గిప్పుడు తాగేనీళ్ళల్ల కూడా మందుఏసీ తేవట్టిరి.. సల్లటి కుండలు మాయమయ్యే.డబ్బాలల్ల నీళ్లు కొనుక్కోని తాగవట్టిరి.పానం నట్టం కావట్టే ,పైస పోవట్టె..
ఎనకట ఎటన్న పొయ్యే టోళ్లు నడిసి,నడిసి దూప అయితేఆగుల సెలిమెల నీళ్లు సళ్ళుకొని దూప తీర్సు కునేటోళ్లు. ఇప్పుడు గా సెలిమెలు కూడా కానత్త లేవు..సెలిమెల నీళ్లు ఎవరు తాగుతండ్రు..
సంకల ఓ..ఐస్ నీళ్ల డబ్బవెట్టుకొని ఏడికి వోయిన గా నీళ్లే తాగవట్టిరి.ఎంబటి కొండ వొకుంటే గా నీళ్ల సీసాలు కొనుక్కొని తాగవట్టిరి.
#మోట_బాయి
ఎనకట పొలం కాడ నీళ్లబాయిలు తోడుకొని మోట కొట్టి నీళ్లు పారకం పెట్టుకునేది.ఇప్పుడు బాయిలు తొడుడు ఎక్కడిది సేండ్ల కాడ కూడా బోర్లు ఏసీ కరెంటు మోటరు తోని నీళ్లువారియ్య వట్టిరి.ఇగ నాతిరి ఆ మోటర ఏసీ రాను వొయ్యి ఎంత మంది పానాలు ఇడిసిండ్రో. మోట కొట్టినప్పుడు గిట్ల ఏడ ఉండే. అందరు మంచిగ వుండే..
~~SN~~

కామెంట్‌లు